ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా భిక్షాటనపై నిషేధం విధిస్తూ ‘భిక్షాటన నివారణ (సవరణ) చట్టం–2025’ను అధికారికంగా అమలు చేసింది.
ఈ చట్టం ద్వారా వ్యవస్థీకృత భిక్షాటనను నిర్మూలించడం, నిరుపేదలకు పునరావాసం కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
అక్టోబర్ 27న గెజిట్‌లో చట్టం ప్రచురితమవగా, లా డిపార్ట్‌మెంట్ సెక్రటరీ గొట్టాపు ప్రతిభా దేవి సంతకంతో జీవో ఎంఎస్ నం.58 విడుదలైంది. ఇకపై రాష్ట్రంలో ఎక్కడైనా భిక్షాటన చేస్తే, అది నేరంగా పరిగణించబడుతుంది. సంక్షేమ శాఖ, పోలీసు శాఖ సమన్వయంతో ఈ చట్టాన్ని అమలు చేయనున్నారు.
ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి నగరాల్లో భిక్షాటన మాఫియా పెరుగుతున్న నేపథ్యంలో ఈ చట్టం కీలకంగా మారింది. ప్రభుత్వం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి, అవసరమైన మానవీయ సహాయం అందించనుంది.



