మొంథా తుపాను ప్రభావంతో వరంగల్ నగరంలో భారీ వర్షాలు కురవడంతో పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. హన్మకొండ, కాజీపేట, సుబేదారి, ఎల్కతుర్తి, భద్రకాళి, ఎంజీఎం ప్రాంతాల్లోని కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి.
రోడ్లు నదుల్లా మారిపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పలు ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయిన ప్రాంతాలు కూడా ఉన్నాయి.
మున్సిపల్ సిబ్బంది, రెవెన్యూ అధికారులు సహాయక చర్యలు చేపట్టినప్పటికీ, వరద నీరు తగ్గకపోవడంతో పరిస్థితి విషమంగా మారింది. ప్రజలు తాత్కాలిక ఆశ్రయ కేంద్రాలకు తరలిపోతున్నారు. ప్రభుత్వం అత్యవసర సహాయ చర్యలు వేగవంతం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.




