Home South Zone Telangana తుఫాన్ తాకిడికి తెలంగాణ జలదిగ్బంధం |

తుఫాన్ తాకిడికి తెలంగాణ జలదిగ్బంధం |

0
1

తెలంగాణపై మొంథా తుఫాన్ పంజా విసురుతోంది. ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తోడు, మున్నేరు నదిలో వరద ఉధృతి తీవ్రంగా పెరిగింది.

మూడో ప్రమాద హెచ్చరికకు మరో అర అడుగు దూరంలో ఉన్న మున్నేరు పరివాహక ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు.

పలు గ్రామాలు, కాలనీలు పూర్తిగా నీటమునిగిపోయాయి. రహదారులు తెగిపోవడం, విద్యుత్ సరఫరా నిలిచిపోవడం, తాగునీటి సమస్యలు ప్రజలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేశాయి. అధికారులు సహాయక చర్యలు చేపట్టినా, వరద ఉధృతి తగ్గకపోవడంతో పరిస్థితి మరింత విషమంగా మారుతోంది.

ముఖ్యంగా ఖమ్మం నగరం, పాలెరుపేట, మణుగూరు, మహబూబాబాద్ ప్రాంతాల్లో ప్రజలు తాత్కాలిక ఆశ్రయ కేంద్రాలకు తరలిపోతున్నారు. ప్రభుత్వం అత్యవసర సహాయ చర్యలు వేగవంతం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

NO COMMENTS