సికింద్రాబాద్ : ఉత్తర మండల పరిధిలో సెల్ ఫోన్లు పోగొట్టుకోవడంతోపాటు చోరీకి గురైన కేసులలో పోలీసులు సిఐఆర్ పోర్టల్ ద్వారా సెల్ ఫోన్లను గుర్తించి బాధితులకు అందచేశారు.
ఉత్తర మండల డీసీపీ రష్మీ పెరుమాళ్ ఫిర్యాదుదారులకు సెల్ ఫోన్లను అందించారు. ఉత్తర మండల పరిధిలోని 11 పోలీస్ స్టేషన్లలో చోరీ అయిన 111 సెల్ ఫోన్లను ఫిర్యాదుదారులకు తిరిగి అందజేసినట్లు వెల్లడించారు.
ఇటీవల కాలంలో సెల్ ఫోన్ దొంగతనాలు పెరిగిన నేపథ్యంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సిఐఆర్ పోర్టల్ ద్వారా సెల్ఫోన్లను గుర్తించే వెసులుబాటు ఉన్నట్లు తెలిపారు.
ప్రస్తుత సమాజంలో సెల్ ఫోన్ల లో అత్యంత కీలకమైన సమాచారం సంక్షిప్తమై ఉంటున్న తరుణంలో ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్లను జాగ్రత్తగా పెట్టుకోవాలని సూచించారు.
సెల్ ఫోన్ దొంగతనానికి గురైతే ఆందోళన చెందకుండా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సాంకేతిక పరిజ్ఞానంతో సెల్ ఫోన్ కనిపెట్టవచ్చని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ పోర్టల్ గురించి అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
#Sidhumaroju
