సికింద్రాబాద్ : జనావాస ప్రాంతాలలో మద్యం దుకాణాలను ఏర్పాటు చేయవద్దని డిమాండ్ చేస్తూ బేగంపేట హార్మోని అవెన్యూ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాలనీవాసులు శాంతియుతంగా కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు.
బేగంపేట గురుమూర్తి కాలనీ సమీపంలో గత నాలుగు సంవత్సరాలుగా మద్యం దుకాణం నడుస్తుండడం మూలంగా కాలనీవాసులు, విద్యార్థులు,మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వెల్లడించారు.
ఇటీవల మద్యం టెండర్లు పూర్తవగా వచ్చే నెల నుండి నూతన దుకాణాలు ప్రారంభం కానున్న తరుణంలో కాలనీ సమీపంలో ఉన్న మద్యం దుకాణాన్ని తరలించాలని డిమాండ్ చేశారు. రాత్రి వేళల్లో మద్యం సేవించిన మత్తులో మందుబాబులు కాలనీకి చెందిన విద్యార్థినిలు,మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు తెలిపారు.
కాలనీ లోపలికి రావాలంటే భయాందోళనకు గురికావాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్సైజ్ అధికారుల దృష్టికి తీసుకువెళ్తే నిర్లక్ష్యాలకు సమాధానాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని మద్యం దుకాణాన్ని వేరొక చోటికి తరలించేంతవరకు పోరాటం సాగిస్తామని పేర్కొన్నారు.
#sidhumaroju
