Home South Zone Telangana వాహనదారులపై దందా – సూడో పోలీస్ అరెస్ట్ |

వాహనదారులపై దందా – సూడో పోలీస్ అరెస్ట్ |

0

సికింద్రాబాద్ : బోయిన్ పల్లి పిఎస్ పరిధిలో నకిలీ పోలీసుగా చలామణి అవుతూ వాహనదారుల నుండి డబ్బులు వసూలు చేస్తున్న మసూద్ ఖాన్ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఉత్తర మండల డిసిపి రష్మీ పెరుమాళ్ తెలిపారు.

నాగపూర్ జాతీయ రహదారి పక్కనే వాహనాలను ఆపి తనిఖీ చేస్తూ వాహనదారుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అల్వాల్ కు చెందిన రంజన్ మాలిక్ అనే వ్యక్తి నెంబర్ ప్లేట్ లేని వాహనంపై వస్తుండగా అతన్ని ఆపినట్లు తెలిపారు.

వాహనంపై చలాన్లు ఉన్నాయని 2 వేల రూపాయలు జరిమానా చెల్లించాలని డిమాండ్ చేయడంతో 400 రూపాయలు చెల్లించారు.సివిల్ దుస్తులలో ఉన్న వ్యక్తి పోలీసు అని చెప్పడంతో అనుమానం వచ్చి వాహనదారుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫిరోజ్ గూడ కు చెందిన మసూద్ ఖాన్ గా గుర్తించి అరెస్టు చేశారు. ఇలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నకిలీ పోలీసులని అనుమానం వస్తే ఫిర్యాదు చేయాలని డిసిపి సూచించారు.

#sidhumaroju

NO COMMENTS

Exit mobile version