సికింద్రాబాద్. :మారేడుపల్లి లో రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. వైద్య పరీక్షల నిమిత్తం కారులో ఆసుపత్రికి వెళ్తున్న వృద్ధ దంపతుల కారు ఒక్కసారిగా అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టింది.
మహేంద్ర హిల్స్ కు చెందిన మారుతి జయలక్ష్మి దంపతులు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్య పరీక్షల కోసం సికింద్రాబాద్ కు బయలుదేరారు. ఆహారం తీసుకోకుండా ఇంట్లో నుండి రావడంతో వాహనాన్ని నడుపుతున్న మారుతి కి చక్కెర వచ్చి కళ్ళు తిరగడంతో బ్రేక్ వేయబోయి ఎక్స్ లెటర్ ను నొక్కడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనలో స్వల్ప గాయాలతో వృద్ధ దంపతులు బయటపడినట్లు ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. వెంటనే డివైడర్ను ఢీ కొట్టిన కారును రహదారిపై నుండి తప్పించి వారిని సురక్షితంగా ఆసుపత్రికి పంపినట్లు తెలిపారు.
వాహనం నడుపుతుండగా కళ్ళు తిరగడంతోనే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులో ప్రమాదం జరిగిందని మారుతి చెప్పారు.
Sidhumaroju




