గూడూరు భారతీయ జనతా పార్టీ రాజంపేట జిల్లా ఇంచార్జ్ చంద్రమౌళి ముఖ్య అతిథి గా మండల అధ్యక్షుడు నవీన్ వేదావ్యాస్ ఆధ్వర్యంలో ఈరోజు మండల ప్రవాస్ యోజన కార్యక్రమం జరిగింది.
స్వదేశీ ఉత్పత్తులు కొనేటటువంటి ఉద్యమం ప్రారంభమైందని ఇంటింటికి తిరిగి నరేంద్ర మోడీ గారి అభివృద్ధి గురుంచి చెప్పాలని రాబోయే స్థానిక ఎలక్షన్స్ లో బీజేపీ హావ కొనసాగాలని ఆయన అన్నారు.
కార్యక్రమంలో జిల్లా నాయకులు మల్లేష్ నాయుడు మరియు గజేంద్ర గోపాల్ పాల్గొన్నారు. బీజేపీ కౌన్సిలర్ డమం శకుంతలబాయ్ ని కలిసి ఆశీర్వాదం తీసుకున్న జిల్లా ఇంచార్జి చంద్రమౌళి




