సికింద్రాబాద్ : కంటోన్మెంట్ నియోజకవర్గం లోని బాలంరాయికి చెందిన మంచోళ్ళ సాయికుమార్ థాయిలాండ్ లో అక్టోబర్ 28 నుంచి నవంబర్ 1 వ తేదీ వరకు నిర్వహించిన వరల్డ్ యూత్ గేమ్స్ ఛాంపియన్ షిప్ – 2025 లో భారతదేశం నుంచి కియో జపాన్ షోటోకన్ కరాటే అసోసియేషన్ ఇండియా తరపున పాల్గొన్నారు .
ఆ పోటీలలో సాయి కుమార్ బంగారు పతకం సాధించి ఈరోజు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ కోచ్ షేక్ ఖలీం తో పాటు వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
సాయి కుమార్ ను, వారి కోచ్ షేక్ ఖలీం ను ఎమ్మెల్యే శ్రీగణేష్ మనస్పూర్తిగా అభినందించి భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించి దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించి, తన వంతు మాత్రమే కాకుండా ప్రభుత్వం తరపున కూడా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందేలా చూస్తానని చెప్పారు.
Sidhumaroju




