Home Bharat Aawaz తిరుమల శ్రీ వేంకటేశ్వరునికి భక్తుని భారీ విరాళం |

తిరుమల శ్రీ వేంకటేశ్వరునికి భక్తుని భారీ విరాళం |

0

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఓ భక్తుడు కుటుంబ సమేతంగా భారీ విరాళం అందించారు. హైదరాబాద్‌కు చెందిన జక్కారెడ్డి శ్రీనివాసులు రెడ్డి అనే భక్తుడు తన కుటుంబంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు.

అనంతరం రూ.30 లక్షల విలువ గల 22 కిలోల వెండి గంగాళాన్ని (Silver Gangalam) స్వామివారికి భక్తిపూర్వకంగా సమర్పించారు.

ఆలయ ప్రాంగణంలో ఆలయ అధికారులకు గంగాళాన్ని కుటుంబ సభ్యులతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు శ్రీనివాసులు రెడ్డి కుటుంబానికి స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు.

NO COMMENTS

Exit mobile version