Home Bharat Aawaz భోగాపురంలో విమానయాన విశ్వవిద్యాలయం |

భోగాపురంలో విమానయాన విశ్వవిద్యాలయం |

0

విజయనగరం జిల్లా భోగాపురంలో (Bhogapuram) విమానయాన విశ్వవిద్యాలయం (Aviation University) స్థాపనకు కృషి చేస్తున్నామని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు (Rammohan Naidu) తెలిపారు. విశాఖపట్నంలో జరగబోయే పారిశ్రామిక సదస్సులో విమానయాన రంగానికి చెందిన కంపెనీలను ఆహ్వానించి, ఈ ప్రాజెక్టుపై చర్చించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ మంత్రి రామ్మోహన్‌నాయుడు, ఇప్పటి వరకు 91.7 శాతం పనులు పూర్తయ్యాయని వెల్లడించారు. డిసెంబరులో ఫ్లైట్‌ టెస్ట్‌ (Flight Test) నిర్వహించనున్నామని, అన్ని పరీక్షలు విజయవంతంగా ముగిసిన తర్వాత జనవరి నాటికి విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని తెలిపారు.

ఈ విమానాశ్రయం పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత భోగాపురం ప్రాంతం ఆర్థిక, పారిశ్రామిక, వాణిజ్య రంగాల అభివృద్ధికి కీలక కేంద్రంగా మారనుందని మంత్రి రామ్మోహన్‌నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు.

NO COMMENTS

Exit mobile version