Home South Zone Telangana అదే వ్యక్తిని 7 సార్లు కాటేసిన పాము – వైద్యులు షాక్|

అదే వ్యక్తిని 7 సార్లు కాటేసిన పాము – వైద్యులు షాక్|

0

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం, బొంకూరు గ్రామానికి చెందిన 28 ఏళ్ల డ్రైవర్‌ను అక్టోబర్ నెలలో ఒకే పాము ఏకంగా ఏడు సార్లు కాటేసింది. ప్రతి కాటుకు వెంటనే ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందడంతో అతడికి ప్రాణాపాయం తప్పింది. అయితే, కొద్ది రోజుల తర్వాత మళ్లీ అదే పాము అతడిని కాటువేసింది.

ప్రమాదం ఇంతవరకు కొనసాగడంతో యువకుడి కుటుంబం తీవ్ర భయాందోళనలో ఉంది. ఇంటి పరిసరాల్లో ఎక్కడా పాము కనిపించని కారణంగా, ఎప్పుడు, ఎలా వస్తుందో తెలియక భయభీతులుగా గడుపుతున్నారు. ఈ వింత సంఘటన గ్రామంలో తెలియగానే స్థానికులు కూడా ఆశ్చర్యపోయారు. బాధితుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్యంగా ఉన్నాడు.

Exit mobile version