సంగారెడ్డి జిల్లా జోగిపేటలో పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. జోగిపేట సత్యసాయి కాలనీలో వృద్ధురాలు శంకరంపేట మణెమ్మపై దుండగులు దాడి చేసి, ఆమె కళ్లల్లో కారం కొట్టి మెడలో ఉన్న నాలుగు తులాల బంగారు పుస్తెలతాడును లాక్కెళ్లారు.
వృద్ధురాలిని రక్షించడానికి ప్రయత్నించిన కూతురు వెంకటలక్ష్మిని తోసేసి నిందితులు బైక్పై పారిపోయారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని, కేసు నమోదు చేశారు. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటన జోగిపేట పట్టణంలో తీవ్ర కలకలం రేపుతోంది.
