తెలంగాణ ప్రభుత్వం మహిళా సంక్షేమం, చేనేత రంగం అభివృద్ధికి కొత్త పథకాన్ని ప్రకటించింది. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో నవంబర్ 19న ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 64 లక్షల మహిళలకు “ఇందిరమ్మ చీరలు” పంపిణీ చేయనుంది.
ఈ పథకం కింద ప్రతి మహిళకు రెండు చీరలు ఉచితంగా అందజేస్తారు. గతంలో ఉన్న బతుకమ్మ చీరల పథకానికి బదులుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ప్రతి చీరకు రూ.480 కేటాయించగా, చీరల తయారీలో సిరిసిల్ల, కరీంనగర్ నేతలు పాల్గొంటున్నారు. ఈ పథకం ద్వారా మహిళలకు ఉపశమనం, చేనేత రంగానికి ప్రోత్సాహం లభించనుంది.
