ఏపీలో మానవులు, వన్యప్రాణుల మధ్య సంఘర్షణలను తగ్గించేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో “హనుమాన్ ప్రాజెక్ట్” ప్రారంభమైంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీకి ఒక సర్పమిత్ర వాలంటీర్ నియమించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
సర్పమిత్రలు పాములను సురక్షితంగా పట్టుకొని అడవుల్లోకి విడిచిపెట్టడం ద్వారా ప్రజల భద్రతను కాపాడుతారు. ఏటా పాముకాట్ల వల్ల వేలాది ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం కీలకం కానుంది. ఫారెస్ట్ అధికారులు, ఏఐ, డ్రోన్లు, రేడియో కాలర్లు వంటి ఆధునిక పద్ధతులతో సమన్వయం చేస్తారు.
హనుమాన్ ప్రాజెక్ట్ మానవ-వన్యప్రాణి సమన్వయానికి కొత్త దిశ చూపనుంది.
