ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి వర్షాల విపత్తు చేరువలో ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే రెండు రోజుల్లో రాష్ట్రంలో అనేక చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముంది.
దక్షిణ కోస్తా వెంట ఈదురుగాలులు గంటకు 35–55 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని తెలిపింది. తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో భారీ వానలు నమోదయ్యే సూచనలు ఉన్నాయి. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.
