తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) 2025 కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (TG FSL) లో మొత్తం 60 పోస్టులు భర్తీ చేయనున్నారు.
నవంబర్ 27, 2025 నుంచి అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టులు 10, విభాగాల వారీగా ఫిజికల్/జనరల్, కెమికల్, బయోలజీ/సెరాలజీ, కంప్యూటర్స్‌లో ఖాళీలు ఉన్నాయి.
అలాగే సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులు 32 ఉండగా, నాలుగు విభాగాల్లో అవకాశాలు కల్పిస్తున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు వివరాలు నోటిఫికేషన్‌లో పరిశీలించి దరఖాస్తు చేసుకోవచ్చు.
