సికింద్రాబాద్.. బేగంపేట హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బస్ స్టాప్ సమీపంలో తెల్లవారుజామున రహదారి ప్రమాదం చోటు చేసుకుంది. పంజాగుట్ట నుండి సికింద్రాబాద్ వైపుకు ప్లాస్టిక్ లోడ్ తో వెళ్తున్న కంటైనర్ బోల్తా కొట్టింది.. తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
పంజాగుట్ట ఫ్లైఓవర్ నుండి వేగంగా దూసుకురావడంతో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సమీపంలోని బస్ స్టాప్ వద్ద అదుపుతప్పి ఎదురుగా ఉన్న థార్ వాహనాన్ని డీ కొట్టింది. ఈ ఘటనలో తార్ వాహనం నుజ్జునుజ్జయింది.
కంటైనర్ డ్రైవర్ సంజయ్ స్వల్ప గాయాలతో బయటపడినట్లు పోలీసులు తెలిపారు.ప్రమాదంలో ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కంటైనర్ వాహనం బోల్తాపడడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడడంతో పోలీసులు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Sidhumaroju
