కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్ గ్రూప్-బి (నాన్ గేజిటెడ్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 250 డిప్యూటీ ఫీల్డ్ ఆఫీసర్ (టెక్నికల్) పోస్టులను 2023, 2024, 2025 గేట్ స్కోర్ ఆధారంగా భర్తీ చేయనుంది.
కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, డేటా సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మాథ్స్ వంటి విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి B.Tech లేదా సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ ఉంటే దరఖాస్తు అర్హత.
గరిష్ట వయస్సు 30 ఏళ్లు. అభ్యర్థులు డిసెంబర్ 14, 2025 లోపు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు పంపాలి. జీతం నెలకు రూ.99,000.
