కరీంనగర్ జిల్లా వావిలాలపల్లిలో ఘోర సంఘటన చోటు చేసుకుంది. మానసిక వైకల్యంతో బాధపడుతున్న కొడుకు (17) మరియు కూతురు (15) పై తండ్రి మల్లేశం దాడికి పాల్పడ్డాడు. మల్లేశం మజా బాటిల్‌లో విషం కలిపి, తర్వాత గొంతు నులిమి చంపే ప్రయత్నం చేశాడు.
పిల్లలు అపస్మారక స్థితిలో పడటంతో, తల్లి పోచమ్మ స్థానికుల సహాయంతో వారిని ఆసుపత్రికి తరలించారు. కూతురు అర్చన మృతి చెందగా, కొడుకు ఆశ్రిత్ పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు మల్లేశాన్ని గుర్తించి, పరారీలో ఉన్న ఆయనను పట్టుకోవడానికి సర్వత్రా ప్రయత్నాలు చేస్తున్నారు.
