Home South Zone Telangana రూ. 500 నోట్లను ఉపసంహరిస్తారనే ప్రచారాన్ని నమ్మవద్దు-కేంద్రం |

రూ. 500 నోట్లను ఉపసంహరిస్తారనే ప్రచారాన్ని నమ్మవద్దు-కేంద్రం |

0

హైదరాబాద్ : ఈ ఏడాది మార్చినాటికి ఏటీఎం కేంద్రాల నుండి రూ. 500 నోట్లను ఉపసంహరిస్తారనే ప్రచారంలో వాస్తవం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( ఆర్బిఐ) త్వరలో రూ. 500 నోట్లను నుండి నిలిపివేస్తుందని సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని పిఐబి ఫ్యాక్ట్ చెక్ విభాగం “ఎక్స్” వేదికగా తెలియజేసింది.

500 నోట్ల ఉపసంహరణ గురించి ఆర్బిఐ ఎలాంటి ప్రకటన చేయలేదని, ఆ నోట్లు చలామణిలో ఉంటాయని స్పష్టం చేసింది.

రూ. 500 నోట్లు చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయని తెలిపింది. ప్రజలు ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని సూచించింది.

అధికార వర్గాల నుంచి వచ్చే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని కోరింది.
#sidhumaroju

NO COMMENTS

Exit mobile version