Home South Zone Telangana కాలనీవాసుల కేసులపై రీ–చెక్ డిమాండ్ |

కాలనీవాసుల కేసులపై రీ–చెక్ డిమాండ్ |

0

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి  డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) బి. శివధర్ రెడ్డి IPS ని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ-

2025 జూలై 15న అల్వాల్‌లోని శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరిగిన బోనాల పండుగ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో చోటుచేసుకున్న ప్రోటోకాల్ ఉల్లంఘన వివాదం,కౌకూర్ ఫార్చ్యూన్ ఎంక్లేవ్ కాలనీ వాసులపై నమోదైన కేసు పునఃపరిశీలన శాంతి భద్రతా చర్యల పురోగతి,
అంశాలను డిజిపి తో వివరంగా చర్చించారు.

బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, ప్రజలపై అనవసరమైన కేసులు నమోదు చేయకుండా, న్యాయబద్ధంగా విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై పోలీసు డిజిపి బి. శివధర్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించి, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు అనిల్ కిషోర్ గౌడ్, మేకల రాము యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
Sidhumaroju

Exit mobile version