Home South Zone Telangana మేడ్చల్ డిసిపి కోటిరెడ్డి ఆధ్వర్యంలో అల్వాల్ పోలీసుల కార్డన్ సెర్చ్.|

మేడ్చల్ డిసిపి కోటిరెడ్డి ఆధ్వర్యంలో అల్వాల్ పోలీసుల కార్డన్ సెర్చ్.|

0

మేడ్చల్ మల్కాజ్గిరి :  మేడ్చల్ డిసిపి కోటిరెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 250 మంది పోలీస్ సిబ్బందితో అల్వాల్ ల్లో భారీగా కార్ధన్ సెర్చ్ నిర్వహించారు.
హస్మత్ పెట్, అంజయ్య నగర్, పాత బోయిన్ పల్లి, కాలనీలలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో సరైన పత్రాలు లేని 22 వాహనాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 130 వాహనాలపై పెండింగ్ లో వున్న సుమారు 50 వేల రూపాయల చాలన్ లను వసూలు చేశారు.

అలాగే బెల్ట్ షాపులలో అక్రమంగా విక్రయిస్తున్న 46 లీటర్ మధ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నేర చరిత్ర కలిగిన 11 మందితో పాటు 19 మంది రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చినట్టు డీసీపీ వెల్లడించారు.

తమ పరిధిలో నేరాల నియంత్రణ, ప్రజల భద్రతను బలోపేతం చేయాలనే లక్ష్యంతో పోలీసులు విస్తృతంగా చేసిన కార్డన్ సెర్చ్ ఆపరేషన్ విజయవంతం అయింది.ఆల్వాల్ పోలీసులు హస్మత్‌పేట్ ప్రాంతంలో జరిపిన ఈ కార్ధన్ సెర్చ్ ప్రత్యేకంగా ప్రజలలో మానసిక బలాన్ని నింపింది.

ఈ ప్రత్యేక డ్రైవ్‌ను మేడ్చల్ డీసీపీ పర్యవేక్షణలో, అడిషనల్ డీసీపీ పురుషోత్తం, పెట్ బషీరాబాద్ ఏసీపీ, బాల గంగిరెడ్డి, మేడ్చల్ ఏసీపి, శంకర్ రెడ్డి, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శంకరయ్య,  ఆల్వాల్ సీఐ ప్రశాంత్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ తిమ్మప్ప తో పాటు 25 మంది సబ్ ఇన్స్పెక్టర్ లు  సిబ్బందితో కలిసి అనుమానాస్పద స్థలాలు, ఇళ్లను పరిశీలించారు. నేర చరిత్ర కలిగిన వ్యక్తులు, అనుమానాస్పద కదలికలు ఉన్న ప్రాంతాలను పోలీసులు చెక్ చేశారు.

అనుమానాస్పద వ్యక్తుల ఐడీలు, అద్దె గదుల ధృవీకరణ పత్రాలు, మరియు నేరాల్లో ఉపయోగించే అవకాశమున్న వస్తువులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రజలకు భద్రతా అవగాహన కల్పిస్తూ, పోలీసులతో సహకరించాల్సిన అవసరాన్ని అధికారులు పేర్కొన్నారు.

Sidhumaroju

NO COMMENTS

Exit mobile version