Home South Zone Telangana కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల అందజేత.|

కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల అందజేత.|

0

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : కంటోన్ మెంట్ నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి మండలం లోని 27 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం ద్వారా మంజూరైన కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే శ్రీ గణేష్  ఋధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో తిరుమలగిరి తహసీల్దార్ బిక్షపతి కలిసి అందజేశారు.

చెక్కుల పంపిణీ అనంతరం ఎమ్మెల్యే లబ్ధిదారులతో మాట్లాడుతూ… పేదింటి కుటుంబాలు ఆడపిల్లల పెళ్లిళ్లు చేసి అప్పుల పాలు కావద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం ద్వారా వివాహం చేసిన ప్రతి పేద కుటుంబానికి 1,00,116/- లను అందజేస్తుందని చెప్పారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మరింత త్వరగా మంజూరు అవుతున్నాయని, ప్రజలు ఇది గమనించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని, ప్రతి పేద కుటుంబానికి సన్న బియ్యం అందజేసి పేద ప్రజల ఇళ్లల్లో ప్రతిరోజు పండుగ జరిగేలా కృషి చేస్తుందని చెప్పారు.

Sidhumaroju

NO COMMENTS

Exit mobile version