*దేవినేని అవినాష్ కామెంట్స్*
*NTR జిల్లా వైసీపీ అధ్యక్షులు*
ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాలు సేకరించడం జరిగింది
అక్టోబర్ 10 నుంచి నిరంతరాయంగా ఈ కార్యక్రమం కొనసాగింది
ప్రతి డివిజన్ ప్రతి ప్రదేశంలో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సంతకాలు చేశారు
NTR జిల్లాలో నాలుగు లక్షల 22 వేలకు పైగా సంతకాలు వచ్చాయి
ఈ సంతకాలను కేంద్ర కార్యాలయానికి 15వ తేదీన పంపిస్తాం
ఈ పంపించే కార్యక్రమం చుట్టుగుంట సెంటర్ నుంచి ర్యాలీగా నిర్వహిస్తాం
MLA గద్దె రామ్మోహన్ ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు
ప్రైవేట్ వ్యక్తులు ఐతేనే మెడికల్ కాలేజీల నిర్వహణ బాగుంటాదని మాట్లాడటం సిగ్గుచేటు
జగన్ మెడికల్ కాలేజీలు కట్టిస్తే వాటిని పూర్తి చేయలేక పోయారు
చంద్రబాబు….జగన్ ను చూసి నేర్చుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు
కరోనా లాంటి సంక్షోభంలో కూడా జగన్ ప్రభుత్వ పథకాలు ఆపలేదు
కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర గడుస్తున్న అభివృద్ధి,,సంక్షేమం లేదు
అబద్ధపు ప్రచారలతో కూటమి ప్రభుత్వం పాలన చేస్తుంది
ఈ పాలనను ప్రజలు అందరూ గమనిస్తున్నారు
జగన్ ను మళ్ళీ గెలిపించటానికి ప్రజలు అందరూ ఎదురు చూస్తున్నారు
ఇప్పటికైనా ప్రభుత్వం తమ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి
15వ తేదీన నిర్వహించే ర్యాలీలో వైసీపీ నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొనాలని కోరుతున్నాం
ఈ ర్యాలీకి పోలీసుల నుంచి కూడా అనుమతులు ఉన్నాయి దయచేసి పోలీసులు కూడా సహకరించాలి, పోలీసులకు తాము కూడా సహకరిస్తాం
