కర్నూలు
కర్నూలు జిల్లా పత్తికొండ ఉపతపాల కార్యాలయం నందు శనివారం రోజు ఉదయం 11 గంటలకు పట్టపగలే దొంగతనం జరిగింది. వివరాల్లోకెళ్తే పత్తికొండ ఉపతపాల కార్యాలయం నందు ఉదయం 11 గంటల సమయంలో కార్యాలయ ఉద్యోగులు పనుల్లో నిమగ్నమై ఉండగా
ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కౌంటర్ లో ఉన్నటువంటి పోస్టల్ ఐస్టెంట్ దగ్గరకు చేరుకొని మాటల్లో పెట్టి అక్కడే టేబుల్ పైన ఉన్నటువంటి 60 వేల రూపాయలను దొంగతనం చేసి పారిపోవడం జరిగింది ఆ ప్రభుత్వం అయినా పోస్టులు ఉద్యోగులు పట్టుకోవడానికి ప్రయత్నించినప్పటికీ దొరకలేదు. పత్తికొండ సబ్ పోస్ట్ మాస్టర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పట్టణ సీఐ తెలియజేశారు