Home South Zone Andhra Pradesh రైల్వే జోన్ గెజిటెడ్ విడుదల కాక రాష్ట్రం నష్టపోతోంది బి శెట్టి

రైల్వే జోన్ గెజిటెడ్ విడుదల కాక రాష్ట్రం నష్టపోతోంది బి శెట్టి

0

*రైల్వే జోన్ గెజిట్ విడుదలకాక రాష్ట్రం నష్టపోతోంది.భీశెట్టి* _కేంద్రరైల్వే మంత్రికి లేఖరాసిన లోక్ సత్తా!!_ *విజయవాడ డిసెంబర్ 16:* విశాఖపట్నం కేంద్రంగా ఏర్పడ్డ దక్షిణ కోస్తా (సౌత్ కోస్ట్)రైల్వే జోన్ కి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసి 11 నెలలు పూర్తి కావచ్చినా నేటికీ కేంద్ర రైల్వే శాఖ గెజిట్ విడుదల చేయకపోవడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందని ఏపీ లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి అన్నారు మంగళవారం విజయవాడ ప్రెస్ క్లబ్ లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ కి రాసిన లేఖను విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ 2019 ఫిబ్రవరి లో కేంద్ర ప్రభుత్వం దక్షిణ కోస్తా(సౌత్ కోస్ట్)రైల్వే జోన్ ఏర్పాటు చేసిందని 2020 లో 170 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయింపులు చేసారని 2025 జనవరి లో డిపిఆర్ ఆమోదిస్తూ జనవరి 8 న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నం జోన్ కార్యాలయంకి శంకుస్థాపన కూడా చేసారని 2025 జూన్ 5 న జోన్ జిఎం గా సందీప్ మాధుర్ ని నియమించారని,విఎంఆర్డీఏ నిర్మించిన డెక్ బిల్డింగ్ లో 6,7, అంతస్థుల భవనాలు తీసుకొని సిద్ధంచేసారని,ఇన్ని చేసి కూడా నేటికీ రైల్వే జోన్ గెజిట్ విడుదల చెయ్యలేదని గెజిట్ విడుదల చెయ్యకపోతే ఉద్యోగుల సర్దుబాటు, జోన్ హద్దులు, పరిపాలనా వ్యవహారాలు ఎలా సాగుతాయని భీశెట్టి ప్రశ్నించారు విశాఖపట్నం, విజయవాడ,గుంటూరు, గుంతకల్లు రైల్వే డివిజన్లు ఇప్పటికే వెనకపడ్డాయని కేంద్ర మంత్రులు, మన రాష్ట్ర ఎంపిలు,గెజిట్ విడుదలకు కృషి చెయ్యాలని, విశాఖపట్నం రైల్వే జోన్ రాజు లేని రాజ్యంల ఉందని,రాష్ట్ర విభజన చట్టం షెడ్యూల్ 8 లో జోన్ అంశం స్పష్టంగా ఉండికూడా 12 సంవత్సరాల్లో పూర్తి చేసుకోలేకపోయామని ఆవేదన వ్యక్తంచేశారు, ఈ సమావేశంలో సామాజిక ఉద్యమకారుడు అనుమోలు గాంధీ,లోక్ సత్తా ప్రతినిధులు ఉప్పులూరి రవితేజ,సతీష్,అరెస్పీ రాష్ట్ర అధ్యక్షుడు జానకిరామ్, ప్రసాద్ బాబు,తదితరులు పాల్గొన్నారు

NO COMMENTS

Exit mobile version