సోషల్ మీడియాలో విపరీత ధోరణులపై చర్చ జరగాలి: మంత్రి లోకేష్
– ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జనవరిలో సెమినార్
– ముఖ్య అతిథిగా హాజరుకానున్న మంత్రి నారా లోకేష్
అమరావతి,డిసెంబరు 20:
ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో జనవరిలో నిర్వహించే సెమినార్కు హాజరవుతారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. శనివారం ఉదయం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఐ జె యూ జాతీయ అధ్యక్షులు, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కామ్రేడ్ శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో ఏపీడబ్ల్యూజే బృందం మంత్రి లోకేష్ ని కలిసింది.
ఈ సందర్భంగా వివిధ అంశాలు మంత్రి లోకేష్ తో చర్చించారు. “సోషల్ మీడియా.. ప్రస్తుత ధోరణులు” అనే అంశంపై ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జనవరిలో రాష్ట్రస్థాయి సెమినార్ నిర్వహించాలని నిర్ణయించింది. దీనికి ముఖ్యఅతిథిగా మంత్రి నారా లోకేష్ ను ఆహ్వానించింది. దీనికి మంత్రి లోకేష్ అంగీకారం తెలిపారు.
సోషల్ మీడియా లో పెరిగిపోతున్న విపరీత ధోరణులపై పై చర్చ జరగాల్సిన అవసరం ఉందని మంత్రి లోకేష్ అభిప్రాయపడ్డారు ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో చొరవ తీసుకొని ఇలాంటి సెమినార్ నిర్వహించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు ముఖ్యంగా జర్నలిస్టులకు సోషల్ మీడియాలో జరుగుతున్న విపరీతధోరణులపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత యూనియన్ల పైన ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
జర్నలిస్టుల అభివృద్ధి, సంక్షేమం, హక్కుల సాధన కోసం ఏపీయూడబ్ల్యూజే చేస్తున్న కృషిని మంత్రి లోకేష్ ప్రశంసించారు. దీనితోపాటు జర్నలిస్టులకు సంబంధించిన పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అన్నిటిని సానుకూలంగా పరిశీలించి పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు . 2026 ఫిబ్రవరిలో జరిగే ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయు) ప్లేనరీ సమావేశాలు విజయవాడలో జరగబోతున్న విషయాన్ని లోకేష్ దగ్గర ఐ జె యూ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి ప్రస్తావించారు.
సమావేశాలు విజయవంతం కావాలని, ప్రభుత్వం తరఫున సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షులు ఐ వి సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి కంచల జయరాజ్, ఉపాధ్యాక్షులు చావా రవి పాల్గొన్నారు.
