Home South Zone Andhra Pradesh కార్మికులపై లాఠీచార్జి – ప్రజాస్వామ్యంపై దాడి: పల్లె కృష్ణ |

కార్మికులపై లాఠీచార్జి – ప్రజాస్వామ్యంపై దాడి: పల్లె కృష్ణ |

0

కార్మికులపై పోలీసులు లాఠీచార్జి చేయడం దుర్మార్గం.
పల్లె కృష్ణ, సిఐటియు తాడేపల్లి మండల కన్వీనర్.
ప్రజాశక్తి తాడేపల్లి రూరల్
శాంతియుతంగా తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నెల్లూరు నగరంలో మున్సిపల్ కార్మికులు ర్యాలీ చేయడంపై పోలీసులు లాఠీ చార్జీ చేయడం దుర్మార్గమైన చర్య అని సిఐటియు తాడేపల్లి మండల కన్వీనర్ పల్లె కృష్ణ అన్నారు.

శనివారం ఎం.టి.ఎం.సి పరిధిలోని కుంచనపల్లి గ్రామ సచివాలయం మున్సిపల్ కార్మికుల మత్సర్ పాయింట్ వద్ద నెల్లూరు లో మున్సిపల్ కార్మికుల పై పోలీసులు లాటి చార్జ్ చేయడాన్ని ఖండిస్తూ, నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కృష్ణ మాట్లాడుతూ తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని ర్యాలీ నిర్వహిస్తున్న మున్సిపల్ కార్మికులపై పోలీసులు జులుం ప్రదర్శించి, కార్మికులను గాయపరిచారని మండిపడ్డారు.

కార్మికులపై లాఠీ చార్జి చేయడమే కాక, అరెస్టు చేసి స్టేషన్ లో పెట్టడం కార్మికుల హక్కులను కాలరాయడమే అవుతుందని ఆయన అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల వలె పారిశుద్ధ్య కార్మికులకు 62 సంవత్సరాలకు రిటైర్మెంట్ కొనసాగించాలని, లేనిపక్షంలో చదువుకున్న తమ పిల్లలకైనా చెత్త ఎత్తే పని ఇప్పించండి అని అడగటం నేరమా అని ఆయన ప్రశ్నించారు. కార్మికులు చేసిన సమ్మె కాలపు వేతనం ఇవ్వమని కార్మికులు అడుగుతున్న ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, కార్మికుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆయన ఎద్దేవా చేశారు.

అరెస్టులతో లాటి చార్జీలతో కార్మిక వర్గాన్ని అణచలేరని హెచ్చరించారు. మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మిక సంఘం తాడేపల్లి మండల అధ్యక్షులు మేకల డేవిడ్, పారిశుద్ధ్య కార్మికులు టి కృష్ణ తులసి, కోటేశ్వరి, ఇసుకపల్లి నాగరాణి, జోజి బాబు, వరికోటి శ్రీనివాసరావు, మేడ వెంకాయమ్మ, వేమూరి సౌజన్య, వేల్పుల విజయ్ కుమారి తదితరులు పాల్గొన్నారు

NO COMMENTS

Exit mobile version