విజయవాడ మున్సిపల్ కమిషనర్ శ్రీ ధ్యాన చంద్ర ఐఏఎస్ గారిని కలిసిన పోతిన వెంకట మహేష్.
జ్యోతి నగర్ 42 ప్లాట్ల ప్రధాన దారి 2012 లోనే రెగ్యులరైజ్ అయిందని అందువల్లనే ఎస్ కే టి వెస్ట్ మెడోస్ అపార్ట్మెంట్ కు మరియు మరికొంతమంది స్థల యజమానులకు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వారు అనుమతులు మంజూరు చేశారని కావున తమరు వీరందరికీ న్యాయం చేయాలని కోరగా కమిషనర్ గారు ఇప్పటివరకు మీరు తప్పించి నన్ను ఎవరూ నేరుగా వచ్చి నన్ను కలవలేదని కచ్చితంగా న్యాయ సలహా తీసుకొని న్యాయం చేసేందుకు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.
కమిషనర్ గారిని వెస్ట్ మేడోస్ అపార్ట్మెంట్ ప్లాట్ యజమానులైన బేవర సాయి సుధాకర్, ఇల్లా భాస్కర్ మరియు గంజి జోషి జోషిలు కలసి అనుమతులు మంజూరు చేసిన అంశం మరియు వాస్తవాలను తెలియజేసి న్యాయం చేయవలసిందిగా కోరారు.
