ప్రెస్ నోట్
విజయవాడ (ఇంద్రకీలాద్రి): ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో నేడు చిన్నారులకు పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కొండపై గల మహా మండపం 7వ అంతస్తులోని ఉచిత వైద్య శిబిరంలో ఆలయ ఈ.ఓ వి.కె. సీనా నాయక్ గారు స్వయంగా పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.
ఈ సందర్భంగా ఈ.ఓ మాట్లాడుతూ.. పవిత్ర పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ వైద్య అధికారులు, Trust board members, సిబ్బంది పాల్గొన్నారు.
