ఏసుక్రీస్తు బోధనలు మానవాళికి మార్గదర్శకం
క్రైస్ట్ టెంపుల్ పాస్టర్ పాల్ ఇమ్మాన్యూల్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు
ముఖ్యఅతిథులుగా పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్
విజయవాడ : ఏసుక్రీస్తు బోధనలు ఇప్పటికీ, ఎప్పటికీ ప్రపంచంలోని మానవాళికి మార్గదర్శకమని ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. . వెటర్నరీ కాలనీలోని వెన్యూ కన్వేన్షన్ లో క్రైస్ట్ టెంపుల్ పాస్టర్ పాల్ ఇమ్మాన్యూల్ ఆధ్వర్యంలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అన్ని మతాల సారాం శం మానవత్వమేనని, ఏసు క్రీస్తు ఎంచుకున్న మార్గం అందరికీ దిక్సూచిగా నిలుస్తున్నదని కొనియాడారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుత ఇతరులపై ప్రేమ, సహనం, శాంతి, సేవాభా వం వంటి గొప్ప గుణాలను ఆచరించాలని శాంతి దూత ఇచ్చిన సందేశం మ నందరికీ ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి బొప్పన భవకుమార్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రెసిడెంట్ మానికొండ శ్రీధర్, ఎన్టీఆర్ జిల్లా ఎన్.ఐ.ఆర్.డి అర్బన్ కో-ఆర్డినేటర్ వి.నరసింహాచౌదరి, టిడిపి నాయకులు చాట్ల రాజశేఖర్, ఇత్తడి చార్లెస్, అబీద్ హుస్సెన్, మాదిగాని గురునాధంలతోపాటు తదితరులు పాల్గొన్నారు.
