కర్నూలు :
కర్నూలు జిల్లాలో అనుమతులు లేకుండా లాడ్జీలు, ప్లాట్లు కొనుగోలు చేసినవారు వెంటనే అనుమతులు పొందాలని కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు సూచించారు.
శనివారం ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం అనుమతులు లేనివారికి అవకాశం కల్పించిందని, కుడా రుసుం చెల్లించి అప్రూవల్ పొందాలని తెలిపారు. భవిష్యత్తులో అనుమతులు లేకుండా నిర్మించిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా హెచ్చరించారు.
