ఐజేయు జిల్లా కార్యవర్గ సభ్యులు గొడుగు శ్రీనివాస్ గౌడ్
మహబూబాబాద్::కొత్తగూడ:::::గ్రామ పంచాయతీ మూడో విడత ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కొత్తగూడ మండలం తాటివారి వేంపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ గా గెలుపొందిన తాటి వసంత రమణయ్య, వార్డు సభ్యులు ఇర్ప వినోద్ కుమార్,జోగ వెంకటలక్ష్మి,రాసురి.సుగుణమ్మ లను టియుడబ్ల్యూ ఐజేయు జిల్లా కార్యవర్గ.
సభ్యులు,సీనియర్ జర్నలిస్టు,అంబేద్కర్ నేషనల్ ఫెలోషిప్ అవార్డు గ్రహీత గొడుగు శ్రీనివాస్ గౌడ్ దంపతులు మర్యాదపూర్వకంగా కలసి శాలువాతో సత్కరించి, పుష్పాగుచ్చం,ఫోటో ఫ్రేమ్ ను బహుకరించి, కేక్ కట్ చేసి,స్వీట్లు పంపిణీ చేశారు.అనంతరం సర్పంచ్, వార్డు సభ్యులకు హృదయపూర్వక హార్దిక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం ప్రజల్లో ఉంటూ, ప్రజల ఆధార అభిమానాలను పొంది వేంపల్లి గ్రామం సర్పంచ్ గా ఘన విజయం సాధించడం గర్వించదగ్గ విషయమని అన్నారు.ప్రజా ఆశీర్వాదంతో గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.భవిష్యత్ లో మరిన్ని పదవులు అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సోలం వెంకన్న,బీరం తిరుమలేష్,తాటి కోమ్మయ్య,జోగ సమయ్య,ఇర్ప సంపత్,జోగ పోతయ్య,జోగ నందిని,సునిత, రమాదేవి,చంద్రకళ, వాసం సురేందర్,వాసం సింహాద్రి,నిర్మలా, నర్సమ్మ,ఇర్ప నారాయణ,జోగ నర్సయ్య,వజ్జ యాకలక్ష్మి,జోగ వీరలక్ష్మీ,తాటి సుమలత,తాటి శృతి, బుచ్చమ్మ,వాసం పాపయ్య తదితరులు పాల్గొన్నారు.
