Home South Zone Andhra Pradesh క్రీస్తు సూక్తులు అనుసరించాలి ఎంపీ కేశినేని శివనాదం |

క్రీస్తు సూక్తులు అనుసరించాలి ఎంపీ కేశినేని శివనాదం |

0

శాంతి, ప్రేమ, కరుణ, త్యాగం చాటే క్రీస్తు సూక్తులు అనుస‌రించాలి : ఎంపీ కేశినేని శివ‌నాథ్
ప్రేమ స‌మితి 18వ వార్షికోత్స‌వ సెమీ క్రిస్మ‌స్ వేడుక‌లు
ముఖ్యఅతిథిగా హాజ‌రైన ఎంపీ కేశినేని శివనాథ్

విజ‌య‌వాడ : ప్రపంచానికి శాంతి, ప్రేమ, కరుణ, త్యాగం వంటి ఉన్నత విలువలను బోధించిన యేసుక్రీస్తు సూక్తులు ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో అనుస‌రించే విధంగా వుంటాయ‌ని ఎంపీ కేశినేని శివ‌నాథ్ అన్నారు.

చుట్టుగుంట సెంట‌ర్ లోని ఈ సేవా కేంద్రం ప‌క్క‌న ప్రేమ స‌మితి క‌మిటీ ఆధ్వ‌ర్యంలో 18వ వార్షికోత్స‌వ సెమీ క్రిస్మ‌స్ వేడుక‌లు ఘ‌నంగా జరిగాయి. ఈ వేడుక‌ల‌కు ముఖ్యఅతిథి గా ఎంపీ కేశినేని శివ‌నాథ్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్బంగా ఎంపీ కేశినేని శివ‌నాథ్ క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియ‌జేశారు.

చిన్నారులకు గిఫ్టులు అందజేసి సెమీ క్రిస్మస్ కేక్ కట్ చేశారు.. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు

క్రీస్తు త్యాగస్ఫూర్తిని స్మరించుకుంటూ, మానవతా విలువలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి బొప్పన భవకుమార్, ఎన్టీఆర్ జిల్లా మైనార్టీ సెల్ అధ్య‌క్షుడు షేక్ క‌రీముల్లా, ప్రేమ స‌మితి క‌మిటీ ఆర్గ‌నైజ‌ర్ రాముప్ర‌భు, స్థానికులు ప‌ల్లి శ్రీను, కొడేల మ‌ల్లేష్ యాద‌వ్, వ‌ల్లేపు దుర్గరావు లతోపాటు తదితరులు పాల్గొన్నారు

NO COMMENTS

Exit mobile version