స్టేట్ మీడియా అక్రిడిటేషన్ కమిటీ జీవోను తక్షణమే రద్దు చేయండి.: సమాచార శాఖ మంత్రి కొలసు పార్థసారథి గారికి ఏపీజేయు వినతి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు మంజూరు చేసేందుకు 2026 27 సంవత్సరానికి గాను ప్రభుత్వం జీవో ఎంఎస్ నెంబర్ 2410 ను విడుదల చేసింది. గతంలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (APUWJF)దాని అనుబంధ సంస్థ పలు
సందర్భాల్లో వర్కింగ్ జర్నలిస్టుల చట్టాలు రద్దు చేయబడ్డాయని ప్రకటనల ద్వారా తెలిపి ఉన్నారని ,మంగళవారం ఆయన విజయవాడ ప్రెస్ క్లబ్లో జరిగిన మీట్ ది ప్రెస్ కు హాజరైన రాష్ట్ర సమాచార పూర్వ సంబంధాల శాఖ మంత్రి శ్రీ కొలుసు పార్థసారథికి వివరించారు.
కార్యక్రమం అనంతరం ఆయనను ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను వెంకట వేణు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాదంశెట్టి శేఖర్ బాబు లు కలిసి వినతి పత్రం సమర్పించారు. ఆ వినతిపత్రంలో వారు
రాష్ట్ర సమాచార పౌర సంబంధ శాఖ విడుదల చేసిన రాష్ట్ర ,
జిల్లా అక్రిడిటేషన్ కమిటీలలో వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ రద్దు అయినదని చెప్పిన యూనియన్లకి అవకాశాలు కల్పించి ఉన్నారని వారు పేర్కొన్నారు.
అలాగే ప్రభుత్వానికి కోట్ల రూపాయలు (విజయవాడ ప్రెస్ క్లబ్ కు సంబంధించిన పన్ను) బకాయి ఉన్న ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (APUWJ) సంఘానికి కానీ అనుబంధ సంఘాలకు కూడా రాష్ట్ర మరియు జిల్లా అక్రిడిటేషన్ కమిటీలలో ప్రాతినిధ్యం కల్పించి ఉన్నారని. తక్షణమే ఈ జీవో ద్వారా
అవకాశం కల్పించిన యూనియన్ ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులను వసూలు చేయాలని ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్(APJU ) డిమాండ్ చేస్తున్నదన్నారు. ఏపీయూడబ్ల్యూజే, మరియు ఏపీయు డబ్ల్యూ జే ఫెడరేషన్ వాటి అనుబంధ సంస్థలన్నింటి కి కమిటీలలో కల్పించిన స్థానాలను రద్దు చేసి .
రద్దుచేసి సొసైటీ యాక్టు కింద రిజిస్టర్ అయినటువంటి జర్నలిస్టుల యూనియన్ లకు అవకాశం కల్పించాలని కోరారు. అలా కానీ పక్షంలో ఏపీ జెయూ తీసుకునే నిర్ణయాన్ని సమాచార శాఖ మంత్రి శ్రీ కొలసు పార్థసారధి గారికి
వినతి పత్రం ద్వారా తెలియజేయడం జరిగినది. మంత్రి సానుకూలంగా స్పందించారు. మంత్రి ని కలిసిన వారిలో ఏపీజేయు కార్యవర్గ సభ్యులు ఉన్నారు.
