Home South Zone Andhra Pradesh 44వ జాతీయ స్థాయి యోగాసన ఛాంపియన్‌షిప్ 2025 |

44వ జాతీయ స్థాయి యోగాసన ఛాంపియన్‌షిప్ 2025 |

0

44వ జాతీయ స్థాయి యోగాసన ఛాంపియన్ షిప్ …2025ను జయప్రదం చేద్దాం. బాపట్ల శాసనసభ్యులు & జాతీయ యోగాసనా ఛాంపియన్ షిప్ 2025 ఆహ్వాన కమిటీ చైర్మన్  వేగేశన నరేంద్ర వర్మ రాజు ఇండియన్ యోగ ఫెడరేషన్ నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ యోగ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 27,28,29 తేదీలలో నిర్వహిస్తున్న 44వ జాతీయ స్థాయి యోగాసన ఛాంపియన్షిప్ – 2025 ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించి జయప్రదం చేద్దామని బాపట్ల శాసన సభ్యులు మరియు జాతీయ యోగాసనా ఛాంపియన్ షిప్ 2025 ఆహ్వాన కమిటీ  చైర్మన్ వేగేశన నరేంద్ర వర్మ రాజు పిలుపు ఇచ్చారు.

మంగళవారం బాపట్ల పట్టణంలోని ఎమ్మెల్యే నివాసం వద్ద 44వ జాతీయ స్థాయి యోగాసన ఛాంపియన్ షిప్  2025 గోడ పత్రికను ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు లాంఛనంగా ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలోని 26 రాష్ట్రాలకు చెందిన, 16 విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ చూపించిన రాష్ట్రస్థాయి ఛాంపియన్లు 600 మంది ఈ జాతీయ స్థాయి చాంపియన్ షిప్ కు హాజరు అవుతారని, రాష్ట్ర యువజన, క్రీడా శాఖ మాత్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభిస్తారని  తెలిపారు.

15 సంవత్సరాల తరువాత ఆంధ్రప్రదేశ్ కు ఈ ఛాంపియన్షిప్ నిర్వహించే అవకాశం లభించగా ఆ పోటీలకు బాపట్ల నియోజకవర్గం వేదిక కానుండటం హర్షణీయమని, బాపట్ల మండలం జిల్లెల్లమూడి విశ్వ జనని పరిషత్ ప్రాంగణంలో 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.
ప్రపంచానికి యోగ విద్యను పరిచయం చేసి విశ్వ గురువుగా భారతదేశం రాణిస్తున్న వేళ, యోగా యొక్క విశిష్టతను బహుళ ప్రయోజనాలను గురించి ప్రజలకు తెలియజేసే బృహత్తర కార్యక్రమంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నామని చెప్పారు.

ఈ పోటీల కు సంబంధించిన పలు ఏర్పాట్లపై ఇప్పటికే సమీక్షించడం జరిగిందని,  జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని ప్రత్యేకంగా జిల్లెళ్ళమూడి లో  ఏర్పాటు చేస్తున్నట్లు, అదేవిధంగా గ్రామంలో పారిశుధ్యం మెరుగుపరచి రోడ్లను, పరిసరాలను అత్యంత పరిశుభ్రంగా ఉంచాలని గ్రామ పంచాయితీ అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.
ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ యోగ అసోసియేషన్ కమిటీ ఎంతో నిబద్ధతతో పనిచేస్తున్నారని అభినందనలు తెలియజేసి, ఏర్పాట్లలో ఎక్కడ లోటుపాట్లకు తావివ్వొద్దని సూచించారు.

మరోవైపు పోటీలు జరిగే జిల్లేళ్ళముడి గ్రామంలోని విశ్వ జననీ పరిషత్ ప్రాంగణాన్ని అత్యంత ఆకర్షణీయంగా,  శోభాయమానంగా వేదిక మరియు పరిసరాలను తీర్చిదిద్దనున్నట్లు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ యోగ అసోసియేషన్ చైర్మన్ & ఆర్గనైజింగ్ సెక్రటరీ  కళ్ళం హరినాధ రెడ్డి, కార్యదర్శి అల్లాడి రవికుమార్, వివేకా సర్వీస్ సొసైటీ కార్యదర్శి అంబటి మురళీకృష్ణ, ప్రముఖ ఆడిటర్ చాపల సుబ్రహ్మణ్యం లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు శీలం శ్రీనివాసరావు, విశ్రాంత ఉపాధ్యాయులు వీరభద్రరావు,  ప్రముఖ అబ్జర్వేషనల్ సైకాలజిస్ట్ పిన్నిబోయిన శ్రీమన్నారాయణ తదితరులు ఈ గోడ పత్రిక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

# నరేంద్ర

NO COMMENTS

Exit mobile version