కనకమేడల రవీంద్రకు అభినందనలు తెలిపిన ఎంపీ కేశినేని , ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్
విజయవాడ: సుప్రీంకోర్టులో భారత ప్రభుత్వ అదనపు సొలిసిటర్ జనరల్ గా (ASG) నియమితులైన సీనియర్ న్యాయవాది, టిడిపి మాజీ రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్రను ఎంపీ కేశినేని శివనాథ్.
ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అభినందనలు తెలిపారు. బుధవారం లబ్బీపేటలోని ఆయన నివాసంలో కలిసి శాలువాతో సత్కరించి కొండపల్లి బొమ్మను బహుకరించారు. రాజ్యసభ సభ్యునిగా విశేష సేవలందించిన కనకమేడల రవీంద్ర, ఇకపై అత్యున్నత న్యాయస్థానంలో కేంద్ర ప్రభుత్వం
తరుఫున కీలక వాదనలు వినిపించనుండటం ఎంతో ఆనందంగా వుందని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. దేశంలోనే ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ పదవిలో తెలుగు వ్యక్తి…నియమితులు కావటం ఎంతో గర్వంగా వుందని ఎమ్మెల్యే గద్దె అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సొంగా సంజయ్ వర్మ తో పాటు తదితరులు పాల్గొన్నారు.
