మార్కస్ మసీదు సెంటర్ వద్ద స్పీడ్ బ్రేకర్ ఏర్పాటుకు విన్నతి
చీరాల: చీరాల పట్టణంలోని మార్కస్ మసీద్ సెంటర్ వద్ద తరచుగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేయాలని చీరాల ముస్లిం కమిటీ సభ్యులు మున్సిపాలిటీ చైర్మన్ ను మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా టిడిపి పట్టణ ముస్లిం మైనారిటీ జనరల్ సెక్రెటరీ శ్రీ సయ్యద్ భాషా గారు మరియు సీనియర్ నాయకులు శ్రీ షేక్ బాజీ షరీఫ్ గారు హాజరయ్యి స్థానిక ప్రజలు భద్రత దృష్ట్యా స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు అత్యవసరమని మార్కస్ మసీదు పరిసర ప్రాంతాల్లో పాఠశాల విద్యార్థులు వృద్ధులు మహిళలు అధికంగా రాకపోకలు సాగిస్తుండటంతో వాహనాల వేగం నియంత్రణ అవసరమని మున్సిపల్ చైర్మన్ గారికి వివరించారు దీనికి మున్సిపల్ చైర్మన్ గారు సానుకూలంగా స్పందన చూపి సంబంధిత అధికారులు తో చర్చించి తగు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
#నరేంద్ర
