Home South Zone Andhra Pradesh మదనపల్లె: పోలీసుల దాడిపై వెంకటరమణ ఆరోపణ.

మదనపల్లె: పోలీసుల దాడిపై వెంకటరమణ ఆరోపణ.

0

మదనపల్లె–2 టౌన్ పోలీసులు తనను విచక్షణారహితంగా కొట్టారని కలకడ మండలం గొల్లపల్లికి చెందిన వెంకటరమణ శనివారం ఆరోపించారు. తన భార్యకు మానసిక సమస్యలు ఉండటంతో చికిత్స చేయిస్తున్నామని, సొంత ఊరిలో ఇరుగుపొరుగు వారితో గొడవల కారణంగా వేరే ఊరికి మారినా, తిరిగి వచ్చాక కూడా గొడవలు కొనసాగాయని తెలిపారు. భార్య ఫిర్యాదుతో స్టేషన్‌కు తీసుకెళ్లి వేళ్లు విరిగేలా కొట్టారని ఆయన ఆరోపించారు. ఘటనపై న్యాయం చేయాలని ఆయన కోరారు.

NO COMMENTS

Exit mobile version