కర్నూలు:
గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి నేరుగా వినతులను స్వీకరించి పరిష్కరించిన కోడుమూరు ఎమ్మెల్యే శ్రీ బొగ్గుల దస్తగిరి !!తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులుశ్రీ నారా చంద్రబాబు నాయుడి గారి ఆదేశాల మేరకు ఈరోజు కోడుమూరు నియోజక వర్గం
శాసనసభ్యులు శ్రీ బొగ్గుల దస్తగిరి తన నివాసం నందు నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో నియోజకవర్గం నలుమూలల నుంచి విచ్చేసిన వివిధ వర్గాల ప్రజల నుంచి వచ్చిన సమస్యలపై ఎమ్మెల్యే ప్రత్యక్షంగా అర్జీలు స్వీకరించారుఅర్జీలను పరిశీలించి సంబంధిత అధికారులతో
ఫోన్‌లోనే మాట్లాడి కొన్ని సమస్యలకు తక్షణ పరిష్కారం అందించారు.మరికొన్ని సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేందుకు హామీ ఇచ్చారు.గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి పూర్తిగా కట్టుబడి ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
