అన్నమయ్య జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ లక్ష్మీ నరసయ్య, ఈ నెల 17న నిర్వహించనున్న జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
బుధవారం మదనపల్లి డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లాలో 1 సంవత్సరం నుంచి 19 సంవత్సరాల లోపు పిల్లలు మొత్తం 3,96,796 మంది ఉన్నారని, వారందరికీ ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని సిబ్బంది సమన్వయంతో, బాధ్యతగా నిర్వహించాలని సూచించారు
