కర్నూలు : ద్విచక్రవాహనదారులకు హెల్మెట్ లేకపోతే పెట్రోల్ పోయెద్దు …కర్నూలు డిఎస్పీ శ్రీ జె. బాబు ప్రసాద్ !!ద్విచక్రవాహన ప్రమాదాలు తగ్గించేందుకు చర్యలు చేపట్టిన కర్నూలు పోలీసులు.
2026 నూతన సంవత్సరం రానుండడంతో కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, కర్నూలు డిఎస్పీశ్రీ జె. బాబు ప్రసాద్ గారు, కర్నూలు ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్ తో కలిసి కర్నూలు డిఎస్పీ కార్యాలయంలో కర్నూలు నగరంలోని పెట్రోల్ పంప్ స్టేషన్ యజమానులతో సమావేశం నిర్వహించారు.
హెల్మెట్ లేకుండా వచ్చిన వారికి పెట్రోల్ పోయోద్దని పెట్రోల్ బంకు నిర్వహకులకు ఆదేశాలు జారీ చేశారు. 2025 డిసెంబర్ 30 నుండి ద్విచక్రవాహనాలు నడిపే వ్యక్తులకు ‘హెల్మెట్ లేకపోతే పెట్రోల్ లేదని .
కర్నూలు పట్టణ ప్రజలు అందరూ సహకరించాలని దీనిని ఖచ్చితంగా పాటించాలన్నారు. ముఖ్యంగా జాతీయ రహాదారులలో No Helmet–No Petrol నిబంధన కఠినంగా అమలు చేయనున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో 45% మరణాలు బైకుల నిర్లక్ష్యంతో జరుగుతుండగా,
హెల్మెట్ వాడితే 40% ప్రాణాలు నిలుస్తాయని తప్పనిసరిగా ధరించాలని కర్నూలు డిఎస్పీ శ్రీ జె. బాబు ప్రసాద్ తెలిపారు.




