Home South Zone Andhra Pradesh వంగవీటి మోహనరంగా కు వెల్లంపల్లి నివాళి |

వంగవీటి మోహనరంగా కు వెల్లంపల్లి నివాళి |

0

వంగవీటి రంగా కు మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు నివాళి*

*పలుచోట్ల జరిగిన వంగవీటి రంగా వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు*

*నేటికీ కూడా ప్రజల గుండెల్లో పాతుకుపోయిన వ్యక్తి వంగవీటి మోహన రంగా – వెలంపల్లి శ్రీనివాసరావు*

పీడిత ప్రజల ప్రియతమ నాయకుడు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 37వ వర్ధంతి సందర్భంగా రంగా అభిమానులు పలుచోట్ల ఏర్పాటుచేసిన వర్ధంతి కార్యక్రమాలలో మాజీమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొని రంగా గారి విగ్రహానికి మరియు చిత్రపటాలకు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.

స్థానిక 44వ డివిజన్ చెరువు సెంటర్ లోని వంగవీటి మోహన రంగ విగ్రహం వద్ద వైసిపి నాయకులు గొంది ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన వంగవీటి మోహన్ రంగ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని వంగవీటి మోహన రంగ విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు

స్థానిక 47వ డివిజన్ కుండల మార్కెట్ వద్ద వైసిపి నాయకులు కూరాకుల నాగ ఆధ్వర్యంలో నిర్వహించిన వంగవీటి మోహన్ రంగ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని వంగవీటి మోహన రంగ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం మహిళలకు చీరలు పంపిణి చేసారు

ఈ సందర్భంగా మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ నిరంతరం ప్రజా సమస్యల పైన ప్రజల కోసం పోరాడిన వ్యక్తి వంగవీటి మోహన రంగా అని కొనియాడారు. రంగా గారు మరణించి నేటికి 37 ఏళ్ళు అయినా ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని గెలుచుకున్నారన్నారు. బడుగు బలహీన వర్గాల పేదల కోసం పోరాడిన వ్యక్తి వంగవీటి మోహన రంగా అని అన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన వ్యక్తి వంగవీటి మోహన రంగ అన్నారు. ప్రజల సమస్యల కోసం చేస్తున్న పోరాటంలో రంగ గారు హత్యకు గురయ్యారన్నారు.హత్యకు గురై 37 సంవత్సరాలు పూర్తయిన నాటి నుంచి ప్రజల గుండెల్లో చెరగని స్థానం వంగవీటి మోహన రంగ గారిదన్నారు.

ఈ కార్యక్రమాలలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పశ్చిమ వైసిపి కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు

NO COMMENTS

Exit mobile version