Home South Zone Andhra Pradesh NRI జంక్షన్ వద్ద డ్రగ్స్ వద్దు బ్రో సంకల్ప అవగాహన కార్యక్రమం

NRI జంక్షన్ వద్ద డ్రగ్స్ వద్దు బ్రో సంకల్ప అవగాహన కార్యక్రమం

0

*ఎన్ఆర్ఐ జంక్షన్ వద్ద ‘డ్రగ్స్ వద్దు బ్రో’ సంకల్ప అవగాహన కార్యక్రమం*

మంగళగిరి మండలం ఎన్ఆర్ఐ జంక్షన్ వద్ద మంగళగిరి పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, వాహన చోదకులను లక్ష్యంగా చేసుకుని ‘డ్రగ్స్ వద్దు బ్రో’ సంకల్ప అవగాహన కార్యక్రమం మంగళగిరి గ్రామీణ పోలీసులు నిర్వహించారు. ఈ సందర్భంగా మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ఫలితాలు, ఆరోగ్యంపై పడే తీవ్ర ప్రభావాలు, కుటుంబాలు–సమాజంపై ఏర్పడే చెడు పరిణామాల గురించి వివరించారు

..డ్రగ్స్, మద్యం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలనే సంకల్పం ప్రతి ఒక్కరిలో కలగాలని వక్తలు పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల ప్రభావంతో రోడ్డు ప్రమాదాలు, నేరాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు.
కార్యక్రమం ముగింపులో అక్కడికి వచ్చిన వాహన చోదకులు, ప్రజల చేత డ్రగ్స్‌కు దూరంగా ఉంటామని.

ఆరోగ్యకరమైన జీవనం సాగిస్తామని, ఇతరులకు కూడా అవగాహన కల్పిస్తామని వాహనదారుల చేత గ్రామీణ పోలీసులు సంకల్ప ప్రమాణం చేయించారు.

NO COMMENTS

Exit mobile version