తస్మాత్ జాగ్రత్త ప్రజలారా…..????*
హోటల్స్ కర్రి పాయింట్స్ లో కూరలు కొంటూ భోజనం చేసేభోజన ప్రియులు అప్రమత్తంగా ఉండాలి
తెలుగు రాష్ట్రాల్లో కుళ్ళిన కూరగాయలతో కల్తీ కర్రి పాయింట్స్ వ్యాపారాలు అడ్డు అదుపు లేకుండా నడుస్తున్నాయి…
ఎక్కువగా హాస్టల్లో ఉండే యువత వంట చేసుకోకుండా హోటల్ పుడ్ కు అలవాటు పడి కర్రీస్ పాయింట్లకు అలవాడు పడిపోయిన పరిస్థితి రెండు తెలుగు రాష్ట్రాలలో విపరీతం అయ్యింది…
వివిధ రకాల పేర్లతో కల్తీ కర్రీస్ పాయింట్లు ఎక్కువయ్యయి …
ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా శుభ్రత లేని కర్రీ పాయింట్స్ సెంటర్లు ఎక్కువగా నడుస్తున్నాయి…
మనం నిత్యం తినే ఆహారంలో ఏమాత్రం ఆరోగ్య కరైమైన వంటకాలు చెయ్యడం లేదు …
పరిశుభ్రత లేకుండా ప్రజలు తినే ఆకుకూరల నుండి మొదలుకొని పప్పు సాంబారు వరకు అన్ని కల్తీ …
మనం తినే భోజన పదార్థాల్లో కల్తీ ఉందని తెలియకుండానే దాదాపు అన్ని సమయాలలో కల్తీ ఆహారాన్ని తింటూ కల్తీ కూరలనే మనం
ఎక్కువగా తింటూ మనకు తెలియకుండానే
ఆహార విషయాల్లో మనం మోసపోతున్నాం
ప్రస్తుత రోజుల్లో ఏది కల్తీ ఆహారం..
ఏది ఆరోగ్యకరమైనదో గుర్తించడం చాలా కష్టం.
బయట ఎక్కడ చూసినా దాదాపు ఆహార కల్తీనే ఎక్కువగా కనిపిస్తోంది.
ఆహారం కల్తీ అనేది ఆహార పదార్థాలలో హానికరమైన పదార్ధాలను కలుపుతారు.
నాణ్యత లేని ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.
తక్కువ ఖర్చుతో ఎక్కువ డబ్బు సంపాదించడానికి కొంతమంది కల్తీ వ్యాపారాలను పెట్టీ ప్రజల ఆరోగ్యలను పాడుచేస్తున్నారు
వివిధ రకాల ఆహార పదార్థాలతో కలిపే ‘కల్తీ’ వల్ల వినియోగదారులకు తీవ్ర అనారోగ్యాలు గురిచేస్తాయని ఎవరూ గుర్తించడం లేదు.
మనం వంటల్లో వాడే ఆహార పదార్థాల్లో పాలు, తేనె, ఉప్పు, కారం, పసుపు, బియ్యం పప్పులు కొబ్బరినూనెలో కూడా దాదాపుగా
కల్తీనే ఎక్కువగా జరుగుతోంది
నేటి కాలంలో మనకు తెలియకుండానే
దాదాపు అన్ని సమయాలలో కల్తీ
ఆహారాన్ని తీసుకొని అనారోగ్య పాలవుతూ ఆసుపత్రులలో అడ్మిట్ అవుతున్నారు … ప్రజలు…




