Sunday, December 28, 2025
spot_img
HomeSouth ZoneAndhra Pradeshతూర్పు నియోజకవర్గ ప్రజా దర్బార్‌లో వినతిపత్రాల స్వీకరణ |

తూర్పు నియోజకవర్గ ప్రజా దర్బార్‌లో వినతిపత్రాల స్వీకరణ |

ప్రజా సమస్యలకు సాధ్యమైనంత త్వరగా పరిష్కారం* – *కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్*
తూర్పు కార్యాలయం ప్రజాదర్భార్‌లో ప్రజల వినతుల స్వీకరణ*

ప్రజా సమస్యలను తెలుసుకొని వాటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించడమే తమ ప్రభుత్వ లక్ష్యలమని కార్పోరేటర్‌ ముమ్మనేని ప్రసాద్‌ చెప్పారు.

పటమట అశోక్‌నగర్‌లోని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయం ఆవరణలో ప్రజాదర్భార్‌ కార్యాయం శుక్రవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నాం 1 గంట వరకు జరిగింది. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ నగరంలో లేకపోవడంతో కార్పోరేటర్‌ ముమ్మనేని ప్రసాద్‌ ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బందితో పాటు హజరై ప్రజల నంచి సమస్యల వినతులను స్వీకరించారు. అనంతరం పార్టీ డివిజన్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కార్పోరేటర్‌ ముమ్మనేని ప్రసాద్‌ మాట్లాడుతూ ప్రజా సమస్యలను తెలుసుకొని.

వాటిని పరిష్కరించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పాలన సాగుతుందని అన్నారు. ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్‌ నిర్వహించి ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, వారి సమస్యలకు ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యలను తెలుసుకొని, అధికారులతో సమన్వయం చేసుకొని, పరిష్కరిస్తున్నారని, ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే నియోజకవర్గంలోని ప్రజలు ప్రతి శుక్రవారం తూర్పు నియోకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగే ప్రజాదర్భార్‌కు స్వయంగా వచ్చి ఫిర్యాదులు అందజేయవచ్చునని వివరించారు. ఈ ప్రజాదర్భార్‌లో తెలియజేసిన సమస్యలను అధికారులు ఆన్‌లైన్‌ చేస్తారని, ఈ సమస్యలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్వయంగా పర్యవేక్షిస్తారని చెప్పారు. ఈ ప్రజాదర్బార్‌లో తెలియజేసిన ప్రతి సమస్యను పరిష్కరిస్తామని ముమ్మనేని ప్రసాద్ తెలిపారు.

ఈ కార్యక్రమములో మహమ్మద్‌ కరీమ్, పడాల గంగాధర్, రాజనాల పవన్, పటాన్‌ హయత్‌ ఖాన్, దాసరి గాబ్రియేల్, మాదాల చిన్నతల్లి, కర్ణ రమేష్, రాధారపు యల్లబాబు, స్వర్ణాంధ్ర-విజన్ 2047 విజయవాడ యూనిట్ యంగ్ ప్రొఫెషనల్ ఎం.దుర్గా శాంతి వారి కార్యాలయ సిబ్బంది, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, పార్టీ డివిజన్‌ ప్రెసిడెంట్లు, ఇతర నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments