Home South Zone Telangana పట్టణాలు, గ్రామాల అభివృద్దే ప్రభుత్వ ధ్యేయం |

పట్టణాలు, గ్రామాల అభివృద్దే ప్రభుత్వ ధ్యేయం |

0

దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు,

సుమారు రూ. 17 కోట్ల వ్యయంతో జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు,

భారత స్వాతంత్ర్య నాయకుడు నూకల రామచంద్రా రెడ్డి స్మారక విగ్రహావిష్కరణ

రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

మహబూబాబాద్. డిసెంబర్.27 (భారత్ అవాజ్): మహబూబాబాద్ జిల్లాలోని మరిపెడ మండల కేంద్రంలో భారత స్వాతంత్ర్య నాయకుడు నూకల రామచంద్రా రెడ్డి స్మారక విగ్రహావిష్కరణ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, ఖమ్మం ఎంపీ రఘురామిరెడ్డి, ఇతర నేతలు, జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, అదనపు కలెక్టర్ (రెవెన్యు) కె. అనిల్ కుమార్, ఇంచార్జి ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, భారత స్వాతంత్ర్య నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ మంత్రి నూకల రామచంద్రా రెడ్డి స్మారక కాంస్య విగ్రహాన్ని వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆవిష్కరించి, పూలమాలలు వేశారు. అనంతరం అదే మండలంలో సుమారు 6 కోట్ల 50 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ, బిటి రోడ్లు,

వర్షపు నీటి కాలువ, వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద 42.28 లక్షలతో ఏర్పాటు చేసిన మాజీ మంత్రివర్యులు దివంగత నూకల రామచంద్రా రెడ్డి గారి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పట్టణాలు గ్రామాల అభివృద్ధి ప్రభుత్వం దేయంగా పనిచేస్తూ అన్ని వర్గాల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేనివిధంగా వివిధ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం అన్నారు, మాజీ మంత్రివర్యులు నూకల రామచంద్రా రెడ్డి

గారి విగ్రహాన్ని ఆవిష్కరించే భాగ్యం కలిగినందుకు గాను మనస్పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ ప్రాంత ప్రజలకు అభినందనలు తెలిపారు. నూకల రామచంద్రా రెడ్డి గారి గురించి, వారి విద్యార్థి దశ నుంచి ఏ రకంగా పోరాటాలు చేశారు, అంచెలంచెలుగా ఒక్కొక్క మెట్టు ఎక్కి ఉన్నతమైన స్థానాన్ని ఎక్కారు అనేది గత స్మృతుల్ని జరిగిన సంఘటనలను స్మరించుకుంటూ వారి వ్యక్తిత్వాన్ని, వారు పడ్డ కష్టాన్ని,

వారు ప్రజల పట్ల చూపించిన ప్రేమ, అభిమానం, ఆత్మీయత విశ్వసనీయతను ఎలా చూపించారు, రాజకీయాలంటే ఇలా కూడా చేయొచ్చనేది ఈరోజు వేదిక మీద ఉన్న ప్రముఖులందరూ గుర్తు చేసుకోవడం చాలా గొప్ప విషయమన్నారు. భూస్వామిగా వారి నడవడికలో ఎక్కడా చూపించకుండా రాజకీయాల్లో నాలుగు పర్యాయాలు శాసనసభ్యులుగా, ప్రతి ముఖ్యమంత్రి కేబినెట్లో మంత్రిగా ప్రధానమైన పాత్రను పోషించిన వారి ఆస్తుల్ని కాపాడుకోవడం కోసం కాకుండా వారి ఆస్తుల్ని సంరక్షించుకోవడం కోసం కాకుండా చట్టం అనేది

భవిష్యత్తు కాలానికి ఉపయోగపడాలని రెవెన్యూ చట్టంలో అనేక సంస్కరణలు తేవడమే కాకుండా గిరిజన ప్రాంతమైన ఈ ప్రాంత ప్రజలకి ముఖ్యంగా లంబాడి సోదరులకి ఉపయోగపడే అనేక చట్టాలతో పాటు చివరికి లంబాడీ కులాన్ని కూడా ఎస్టీ జాబితాలో కావాలని ఆనాటి కేబినెట్లో కొట్లాడి ఒప్పించి దాన్ని ఎస్టీలకు తీసుకువచ్చిన మహానుభావుడు నూకల రామచంద్రా రెడ్డి అని అన్నారు.

ఇలా ప్రతి అంశంలో ప్రతి కార్యక్రమంలో తనదైన మార్పుని చూపిస్తూ అంచెలంచెలుగా ఎదిగి ప్రముఖులతో వారికి ఉన్న సాన్నిహిత్యం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రితో, సహచర మంత్రులతో సంప్రదించి నూకల రామచంద్రా రెడ్డి పేరు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా గుర్తుండిపోయేలా చేస్తా అని అన్నారు. వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని, వారి ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అనంతరం ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్,

దివంగత నూకల రామచంద్రా రెడ్డి మనవరాలు రాధిక రెడ్డి, మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ ఎంపీ సీతారాం నాయక్, ఎంఎల్సీ తకేళ్ళపల్లి రవీందర్ రావు, ఎంఎల్సీ బస్వరాజు సారయ్య, ఖమ్మం ఎంపీ రఘురామిరెడ్డి, ప్రభుత్వ విప్ జాటోత్ రామచంద్రు నాయక్, డీసీసీ అధ్యక్షుడు భారత్ చందర్ రెడ్డి, ట్రైకార్ ఛైర్మన్ బెల్లయ్య నాయక్, మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్యలు

మాట్లాడుతూ దివంగత నూకల రామచంద్రా రెడ్డి సేవలను ఎంతగానో కొనియాడారు. తదనంతరం డోర్నకల్ మండల కేంద్రంలో ట్యాంక్ బండ్ రెండు కోట్లు, బీటీ రోడ్డు డ్రైనేజ్ పనులకు ఎనిమిది కోట్ల విలువగల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 50 లక్షలతో ఏర్పాటు చేసిన హైమాస్ లైట్లను ప్రారంభించారు. అదే విధంగా మున్సిపల్ పరిధిలో చెత్త సేకరణ కోసం స్వచ్ఛ ఆటోలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి గణేష్, మరిపెడ, డోర్నకల్ మున్సిపల్ కమిషనర్లు, అన్ని విభాగాల సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.న్నారు.

NO COMMENTS

Exit mobile version