హైదరాబాద్
• జ్యోతి ప్రజ్వలన చేసి ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎన్టీఆర్ ట్రస్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి
• యాన్యూవల్ రిపోర్టులు సమర్పించిన ఎన్టీఆర్ విద్యా సంస్థలకు చెందిన స్కూల్, కాలేజీ ప్రిన్సిపాల్స్ జోజి రెడ్డి, రామారావు.
*ఈ సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి మాట్లాడుతూ…*
• విద్యార్థుల ఆశలకు అనుగుణంగా వారి భవిష్యత్తును రూపుదిద్దుతున్నాం.
• మానవ సేవే మాధవ సేవ అని ఎన్టీఆర్ నమ్మారు.. దానికి అనుగుణంగానే ఎన్టీఆర్ ట్రస్ట్ పని చేస్తోంది.
• ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి హెల్త్ కేర్ సర్వీసులు, తలసేమియా సెంటర్, ఎన్టీఆర్ సంజీవని క్లినిక్‌లు పని చేస్తున్నాయి.
• పేద, అనాథ పిల్లలకు ఉచిత విద్య అందిస్తున్నాం.
• సివిల్ సర్వీసెస్ అకాడెమీ ద్వారా యూపీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారికి శిక్షణ ఇప్పిస్తున్నాం.
• ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు… ప్రకృతి వైపరీత్యాల్లో ఉన్నప్పుడు వారిని అన్ని విధాలా ఆదుకుంటున్నాం.
• స్త్రీశక్తి ద్వారా పేద మహిళలకు ఉపాధి కల్పిస్తున్నాం.
• ఎన్టీఆర్ సుజల ద్వారా రక్షిత తాగునీటిని సరఫరా చేస్తున్నాం
• పేదల జీవితాల్ని బాగుపరిచేలా, విద్యార్థులకు అండగా నిలిచేలా, కుటుంబాలను ఆదుకునేలా ఎన్టీఆర్ ట్రస్ట్ పని చేస్తోంది… ఇదే ఎన్టీఆర్ కు మేం ఇచ్చే నివాళి.
• ఎన్టీఆర్ విద్యా సంస్థల ద్వారా చదువుకున్న వారు వివిధ ప్రాధాన్యత రంగాల్లో రాణిస్తున్నారు.
• విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే టీచర్లు ఎన్టీఆర్ విద్యా సంస్థల్లో ఉన్నారు.
• బాహ్య ప్రపంచంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది… దానికి ఇక్కడి నుంచే సంసిద్దమవ్వండి.
• కోట్లాది మంది హృదయాలను ఎన్టీఆర్ గెలుచుకున్నారు.
• ఎన్టీఆర్ స్పూర్తితో.. ఆయన చూపిన దారిలో ఎన్టీఆర్ విద్యా సంస్థలను, ఎన్టీఆర్ ట్రస్టును నడుపుతున్నాం.
• విద్యార్థులే ఎన్టీఆర్ విద్యా సంస్థలకు అంబాసిడర్లు.
