Home South Zone Andhra Pradesh రౌడీ షీటర్లకు పోలీసుల కౌన్సిలింగ్ !! నేర ప్రవృత్తి వదిలిపెట్టాలి !!

రౌడీ షీటర్లకు పోలీసుల కౌన్సిలింగ్ !! నేర ప్రవృత్తి వదిలిపెట్టాలి !!

0

కర్నూలు :కర్నూలు జిల్లా…నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని  రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ చేస్తున్న కర్నూలు పోలీసులు.చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండండి.కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్  ఐపియస్  గారి ఆదేశాల మేరకు జిల్లాలో నేరనియంత్రణ ,.

శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసు అధికారులు అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలలో రౌడీ షీటర్లకు , నేరచరిత్ర గలవారికి , చెడు నడత కలిగిన వ్యక్తులకు  కౌన్సిలింగ్ నిర్వహించారు.సత్ప్రవర్తనతో జీవించాలని, నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు.

చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటే తప్పనిసరిగా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీసు అధికారులు హెచ్చరించారు.

NO COMMENTS

Exit mobile version